Breaking : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోలు, డీజిల్ పై సుంకం తగ్గింపు
దేశంలో పెట్రోలు, డీజిల్ పై పది రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది
పశ్చిమాసియా యుద్ధం పరిస్థితుల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పెట్రోలు, డీజిల్ పై పది రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. యుద్ధం కారణంగా పెట్రోలు పెరుగుతాయని భావిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చమురుసంస్థల షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి.
ధరలు తగ్గుతాయని...
పెట్రోలుపై పదమూడు రూపాయల నుంచి మూడు రూపాయలుకు తగ్గించింది. డీజిల్ పై పది రూపాయల నుంచి ఎక్సైజ్ సుకం జీరోకు తగ్గించింది. దీంతో దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశముంది. చమురు సంస్థలు ఈ మేరకు ధరల తగ్గింపుపై ప్రకటన చేయాల్సి ఉంటుంది.