India Lockdown : ఇండియాలో లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే?

భారత్ లో లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది

Update: 2026-03-27 07:34 GMT

పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో భారత్ లో లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ఆయన స్పందించారు. ఇలాంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం పరిశీలనలో లేదని తెలిపారు. వదంతలను నమ్మవద్దని, అనవసరమైన ఆందోళనకు గురికావద్దని హర్‌దీప్ సింగ్ పూరి చెప్పారు. న

ఇంధనం పుష్కలంగా...
ప్రపంచ ఇంధన మార్కెట్లు, సరఫరా గొలుసుల్లో చోటుచేసుకుంటున్న మార్పులను ప్రభుత్వం నిరంతరం గమనిస్తున్నదని హర్‌దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇంధనం, కీలక అవసర సరుకులు అంతరాయం లేకుండా అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.ప్రపంచ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులను భారత్ గతంలో సమర్థంగా ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేసిన మంత్రి, తాజా సవాళ్లను కూడా సమన్వయంతో, సమయోచిత చర్యలతో ఎదుర్కొనే సిద్ధత దేశానికి ఉందని ప్రజలకు భరోసా ఇచ్చారు. లాక్ డౌన్ ఆలోచన లేదని ఆయన తెలిపారు.


Tags:    

Similar News