Narendra Modi : నేడు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నారు

Update: 2026-03-27 03:50 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నారు. పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రాల సన్నద్ధతతో పాటు ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై మోదీ చర్చించనున్నారు.

పశ్చిమాసియా పరిస్థితులపై...
యుద్ధం మొదలయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. అయితే ఈ సమీక్షకు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను మినహాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా ఈ పరిస్థితిని ఎదుర్కనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నివ్వనున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో మోదీ విడిగా సమావేశం కానున్నారు.


Tags:    

Similar News