Karnataka : కర్నూలు బస్సు ప్రమాదంతో అలెర్ట్.. కర్ణాటక 604 బస్సులు సీజ్
కర్నూలు ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ప్రైవేట్ బస్సు భద్రతపై కఠిన చర్యలు తీసుకుంది.
కర్నూలు ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ప్రైవేట్ బస్సు భద్రతపై కఠిన చర్యలు తీసుకుంది. మొత్తం పన్నెండు బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహించి, ఎమెర్జెన్సీ డోర్, అగ్నిమాపక యంత్రం వంటి వాటిని పరిశీలించారు. 4,452 బస్సులను తనిఖీ చేసి, 604పై కేసులు నమోదు చేయగా, 102 బస్సులు సీజ్ చేశారు. అక్టోబర్ 24న హైదరాబాద్ నుండి బెంగళూరు వస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన ఏసీ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే.
అన్ని చూసిన తర్వాత...
ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. భద్రతా చర్యలు పాటించని అన్ని ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌కు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. అదనపు రవాణా కమిషనర్ నేతృత్వంలో బెంగళూరు నగరం, గ్రామీణ ప్రాంతాల్లో సైతం బస్సులను తనిఖీ చేయడానికి మొత్తం పన్నెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ సిస్టమ్, అగ్నిమాపక యంత్రం, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి, ప్రయాణికుల వాహనాల్లో అక్రమంగా రవాణా చేస్తున్న వస్తువులు వంటి ప్రయాణీకుల భద్రతా లక్షణాలను లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీ జరిగింది.