దేశ భద్రతపై నేడు ప్రధాని కీలక సమావేశాలు

. నేడు దేశ భద్రతపై ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.

Update: 2025-05-09 02:28 GMT

పాక్ జరుపుతున్న వరస దాడులతో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. నేడు దేశ భద్రతపై ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అజిత్ దోవల్ భేటీ అయి నిన్న రాత్రి జరిగిన దాడుల గురించి వివరించనున్నారు. యుద్ధం జరిగే అవకాశాలు కనిపస్తుండటంతో చర్యలపై చర్చించనున్నారు.

త్రివిధ దళాల అధిపతులతో...
పాకిస్తాన్ జనావాసాలపై దాడులకు తెగబడుతుండటంతో ఐక్యరాజ్యసమితికి ఇప్పటికే భారత్ ఫిర్యాదు చేసింది. తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలన్న దానిపై ప్రధాని మోదీ అధికారులతో చర్చించే అవకాశముం. మరో వైపు నేడు త్రివిధ దళాల అధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ కానున్నారు. భారత్ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశముంది.


Tags:    

Similar News