Big Boss : బిగ్ బాస్ షోకు షాకిచ్చిన పోలీసులు.. హౌస్ సీజ్

బిగ్ బాస్ షోకు కర్ణాటక పోలీసులు షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ ను పోలీసులు సీజ్ చేశారు

Update: 2025-10-08 02:56 GMT

బిగ్ బాస్ షోకు కర్ణాటక పోలీసులు షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ ను పోలీసులు సీజ్ చేశారు. బిగ్ బాస్ హౌస్ కు సంబంధంచి సరైన అనుమతులను పొందలేని కర్ణాటక పోలీసులు షో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. కానీ పోలీసుల నోటీసులకు మాత్రం బిగ్ బాస్ షో నిర్వాహకులు స్పందించలేదు. కన్నడ భాషలో బిగ్ బాస్ షో 12వ సీజన్ నడుస్తుంది.

పర్యావరణ అనుమతులు...
అందుకే నిర్వాహకులు పోలీసుల నోటీసులకు స్పందిచంలేదు. నోటీసులకు స్పందించకపోవడంతోనే కర్ణాటక పోలీసులు బిగ్ బాస్ హౌస్ ను సీజ్ చేశారు. దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లను వేరే ప్రాంతానికి బిగ్ బాస్ షో నిర్వాహకులు తరలించారు. ఒక థియేటర్ కు వాళ్లను తరలించారు. పర్యావరణ అనుమతులు లేవని రెండు సార్లు నోటీసులు ఇచ్చినా నిర్వాహకులు స్పందించకపోవడంతోనే హౌస్ ను సీజ్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News