కారుణ్య మరణాలకు కర్ణాటకలో అనుమతి..?

కర్ణాటకలో కారుణ్య మరణాలకు ప్రభుత్వం అనుమతి. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు పాటిస్తూ 2 దశల్లో పరిశీలన.

Update: 2025-02-01 11:14 GMT

కారుణ్య మరణాలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తీవ్ర అనారోగ్యానికి గురై, చికిత్స అనంతరం కూడా కోలుకోవడం కొందరికి సాధ్యం అవ్వదు. ఇలాంటి పరిస్థితుల్లో రోగుల కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కర్ణాటక రాష్ట్రం నిర్ణయించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్‌ గుండూరావు స్పష్టం చేశారు.

కారుణ్య మరణానికి అర్జీ పెట్టుకున్న రోగి విన్నపాన్ని వైద్యులతో పరీక్ష చేయించి మాత్రమే అనుమతి ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. కారుణ్య మరణానికి సంబంధించిన నివేదికలను పరిశీలించేందుకు రెండు దశల్లో తనిఖీ చేయనున్నారు. చివరిగా న్యాయస్థానం ముందు నివేదికను ఉంచి, అనుమతులు వచ్చిన అనంతరమే ఆ రోగి కోరిక నెరవేర్చనున్నారు.

Tags:    

Similar News