మాజీ ఎమ్మెల్యే పెన్షన్‌కు ధన్‌ఖడ్ దరఖాస్తు
మాజీ ఎమ్మెల్యే పెన్షన్‌కు జగదీప్ ధన్‌ఖడ్ దరఖాస్తు చేసుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే పెన్షన్‌కు జగదీప్ ధన్‌ఖడ్ దరఖాస్తు చేసుకున్నారు. పదవీకాలం మిగిలి ఉన్నప్పటికీ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్న ధన్‌ఖడ్ తనకు పింఛను మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. తనకు ఎమ్మెల్యే పింఛను మంజూరు చేయాలని ఆయన దరఖాస్తు చేసుకున్నారు.
ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసి...
ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన దనఖడ్ తనకు పదవీ కాలం మిగిలి ఉండగానే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారన్న దానిపై నేడు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ధన్ ఖడ్ తాను 1993లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నిక కావడంతో మాజీ ఎమ్మెల్యే పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.