అలాగయితే రైలులో భోజనం ఉచితం
రైలు ఆలస్యంగా వస్తే ప్రయాణికులకు ఉచిత భోజనం అందించాలని ఐఆర్టీసీ నిర్ణయించింది.
రైలు ఆలస్యంగా వస్తే ప్రయాణికులకు ఉచిత భోజనం అందించాలని ఐఆర్టీసీ నిర్ణయించింది. ఒక రైలు రెండు గంటల లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆలస్యమైతేనే ఉచిత భోజనం రైలులో ప్రయాణికులకు అందిస్తారు. ఈ రకమైన వెసులుబాటు ప్రస్తుతం రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్ ప్రెస్ వంటి రైళ్లలో అమలు చేస్తున్నట్లు ఐఆర్టీసీ ప్రకటించింది.
రైలు ఆలస్యమైతే...
ఈ రైళ్లు ఆలస్యమయితే ఉచితంగా టీ, కాఫీ, బిస్కట్లు, బ్రెడ్, భోజనం వంటివి ఆర్డర్ చేసే అవకాశముంది. ఈ సదుపాయాన్ని అన్నిరైళ్లలో ప్రవేశపెట్టాలని ఐఆర్టీసీ నిర్ణయించింది. ట్రైన్ ఎక్కే ముందు మూడు గంటల కన్నా ఎక్కువ సమయం ఆలస్యమయితే టిక్కెట్ కాన్సిల్ చేసుకునే వెసులు బాటును కూడా రైల్వే శాఖ కల్పించింది. వెయిటింగ్ రూమ్ లో ఉన్నా అదనపు ఛార్జీలను వసూలు చేయబోమని తెలిపింది.