బీహార్ లో వింత శిశువు.. గ్రహాంతరవాసిగా ప్రచారం

దాంతో ఆ శిశువును గ్రహాంతరవాసిగా ప్రచారం చేస్తున్నారు. కొందరు మాత్రం వినాయకుడు పుట్టాడని చెబుతున్నారు. రాష్ట్రంలోని..

Update: 2022-11-15 06:26 GMT

alien baby in bihar

బీహార్ లో ఓ వింత శిశువు జన్మించింది. ఆ శిశువుకి ముక్కు స్థానంలో రెండు కళ్లు ఉన్నాయి. ఊపిరి తీసుకునేందుకు ముక్కు రంధ్రం లేదు. దాంతో ఆ శిశువును గ్రహాంతరవాసిగా ప్రచారం చేస్తున్నారు. కొందరు మాత్రం వినాయకుడు పుట్టాడని చెబుతున్నారు. రాష్ట్రంలోని అలీషేర్‌పూర్‌కు చెందిన సరోజ పటేల్ భార్య రూపాదేవి ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. జన్యుపరమైన లోపాల కారణంగా శిశువు ముక్కు ఉండాల్సిన స్థానంలో కళ్లు ఉండి.. చూడటానికి అచ్చం గ్రహాంతరవాసిలా ఉంది.

శ్వాస తీసుకునేందుకు రంధ్రం లేకపోవడంతో వైద్యులు నోటి ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పైపులు ఏర్పాటు చేశారు. వింత శిశువు జననం గురించి తెలిసిన జనం పలు రకాలుగా ప్రచారం చేస్తున్నారు. గైనకాలజిస్టులు మాత్రం.. క్రోమోజోమ్‌ల లోపాలతో శిశువులు ఇలా జన్మిస్తారని అంటున్నారు.


Tags:    

Similar News