నిరుద్యోగులకు గుడ్ న్యూస్...ఆరంభంలోనే నెలకు లక్ష జీతం.. నేరుగా ఇంటర్వ్యూతోనే ఎంపిక

భారత ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారత నౌకాదళంలో 270 పోస్టుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయింది

Update: 2025-02-13 11:56 GMT

భారత ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారత నౌకాదళంలో 270 పోస్టుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయింది. ప్రారంభంలోనే లక్ష రూపాయల వేతనం ఇవ్వనున్నారు. అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూకు పిలవనున్నారు. పదో తరగతి నుంచి పీజీ దాకా.. పోస్టును బట్టి అర్హతలు ఉంటాయి.

ఖాళీలు, అర్హతలు:
ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌: 60
అర్హత: ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్‌లో 60% మార్కులతో ఉత్తీర్ణత.
ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌: 15
అర్హత: బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ
టెక్నికల్‌ బ్రాంచ్‌: 101
ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో 60% మార్కులతో బీఈ/బీటెక్‌ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
వయసు: జనవరి 2, 2001/2002 - జనవరి 1, 2005/2006/2007 మధ్య జన్మించి ఉండాలి (పోస్టును బట్టి మారుతుంది)
అర్హులైన వారు ఫిబ్రవరి 25 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.


Tags:    

Similar News