నేడు జమ్మూకాశ్మీర్ కు రాజ్ నాధ్ సింగ్

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ నేడు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

Update: 2025-08-24 03:20 GMT

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ నేడు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇటీవల తరచూ క్లైడ్ బరస్ట్ తో అనేక గ్రామాలు ముంపునకు గురయి, పదుల సంఖ్యలో గల్లంతయిన నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించునున్నారు. కిష్మ్వార్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రాజ్ నాధ్ సింగ్ పర్యటించనున్నారు.

వరద నష్టాన్ని...
ఇప్పటికే ఈ ప్రాంతంలో సంభవించిన వరద నష్టాన్ని అధికారుల అంచనా వేశారు. వాటిని పరిశీలించనున్నారు. బాధితులకు ఏ రకమైన సహాయక చర్యలు అందాయన్న దానిపై రాజ్ నాథ్ సింగ్ నేరుగా బాధితులతో మాట్లాడే అవకాశముంది. అధికారులతో సమావేశమై సహాయక చర్యలతో పాటు పునరావాసం వంటి వాటిపై కూడా చర్చించనున్నారు.


Tags:    

Similar News