Breaking : ఢిల్లీకి ఆరెంజ్ అలెర్ట్.. వీలయినంత త్వరగా ఇళ్లకు చేరండి
ఢిల్లీకి భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాబోయే కొద్ది గంటల్లో కుండపోత వర్షం కురుస్తుందని తెలిపింది.
ఢిల్లీకి భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాబోయే కొద్ది గంటల్లో కుండపోత వర్షం కురుస్తుందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని కూడా వాతావరణ శాఖ సూచించింది.
భారీ వర్షం కురుస్తుందని...
రుతుపవనాల ప్రభావంతో ఢిల్లీలో భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. వాహనాలతో రహదారులపైకి రాకుండా ఉండటమే మేలని తెలిపింది. ఢిల్లీలో వర్షం పడితే రహదారులన్నీ జలమమయమవుతాయి. అనేక చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే ముందస్తు హెచ్చరికలను అధికారులు ఢిల్లీ ప్రజలకు జారీ చేశారు. వీలయినంత త్వరగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు.