భారత్ లో దుమ్ము రేపుతున్న కరోనా.. ఈరోజు లక్షకు చేరువలో

భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళన కల్గిస్తుంది.. చాలా రోజుల తర్వాత 90 వేల మార్కును దాటింది.

Update: 2022-01-06 04:01 GMT

భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళన కల్గిస్తుంది.. చాలా రోజుల తర్వాత 90 వేల మార్కును దాటింది. ఈరోజు కొత్తగా 90,928 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 325 మంది మరణించారు. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 26,538 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,48,22, 882 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

పెరుగుతున్న యాక్టివ్ కేసులు....
ప్రస్తుతం దేశంలో 2,85,401 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 3,52,18,358 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,82,551 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,48,73,76,774 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.


Tags:    

Similar News