దిగొచ్చిన బంగారం ధరలు

సంప్రదాయాలు, సంస్కృతిపరంగా భారతీయ సమాజంలో బంగారం ఒక వస్తువుగా మారిపోయింది.

Update: 2022-09-22 01:59 GMT

బంగారం పట్ల భారతీయులకే మక్కువ ఎక్కువ. ఇందుకు అనేక కారణాలున్నాయి. సంప్రదాయాలు, సంస్కృతిపరంగా భారతీయ సమాజంలో బంగారం ఒక వస్తువుగా మారిపోయింది. మహిళల ఆభరణాల్లో విలువైన వస్తువుగా అవి ఇమిడిపోయాయి. పెళ్లిళ్లకు ఖచ్చితంగా ఇంత మొత్తం బంగారాన్ని అమ్మాయికి పెట్టి పంపడం ఆనవాయితీగా వస్తున్న విషయం. అందుకే పెళ్లిళ్ల సీజన్ లో బంగారానికి మరింత ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు వంటి కారణాలతో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయన్నది మార్కెట్ నిపుణుల అంచనా.

వెండి స్థిరంగా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారంపై రూ.170 లు వరకూ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,960 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,800 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 62,200 రూపాయలకు లభిస్తుంది.


Tags:    

Similar News