ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు గుడ్ న్యూస్

ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ చెల్లించేందుకు గడువు పెంచింది

Update: 2025-09-16 02:17 GMT

ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ చెల్లించేందుకు గడువు పెంచింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ ను దాఖలు చేసేందుకు గడువును ఒక రోజు పొడిగించినట్టు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ లు దాఖలు చేయడానికి గడువు సెప్టెంబర్ 15నుండి సెప్టెంబర్ 16, 2025 వరకు పొడిగించినట్లు తెలిపింది. ఇప్పటికే అనేక మంది పన్ను చెల్లింపుదారుల కోసం జూలై 31 గడువును ముందే సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు.

ఒకరోజు పెంచుతూ...
తాజా ప్రకటనలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ గడువును మరో రోజు పెంచినట్టు తెలిపింది. సెప్టెంబర్ 16 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 2.30 గంటల వరకు ఈ-ఫైలింగ్ పోర్టల్ మెయింటెనెన్స్ మోడ్‌లో ఉండనుందని వెల్లడించింది. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా సోషల్ మీడియాలో చార్టెడ్ అకౌంటెంట్లు, పన్ను చెల్లింపుదారులు చేసిన ఫిర్యాదుల అనంతరం ఆదాయపు పన్ను రిటర్న్స్ ను గడువు పొడిగింపునకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News