ధరలు తగ్గాయి... ఇక కొనేయండి మరి

ఈరోజు బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్. దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి.

Update: 2022-10-02 02:39 GMT

బంగారం అంటేనే అంతే మరి. బంగారం ఎప్పటికైనా బంగారమే. దానికి విలువ ఎక్కువ. అది ఉంటేనే గౌరవంగా చూస్తారన్న ప్రతి భారతీయ మహిళ బంగారానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది మహిళలు ఆసక్తి చూపుతారు. బంగారం ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుంటారు. భారతీయ కుటుంబంలో బంగారం ఒక భాగమై పోయింది. ప్రతి భారతీయ మహిళ తన ఒంటి మీద బంగారు ఆభరణాలతో అలంకరించుకోవాలని తహతహలాడుతుంటారు. ఆభరణాలను వివిధ డిజైన్లలో రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తుండటంతో వాటిని కొనుగోలు చేయడానికి పోటీ పడుతుంటారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పటికప్పుడు వార్తలు చేరవేస్తుండటంతో కొత్త కొత్త డిజైన్లు అర చేతిలో ఉండటంతో వాటిని ఎంపిక చేయడం కూడా సులువుగా మారింది.

స్వల్పంగా తగ్గిన...
ఈరోజు బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్. దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. గత రెండు రోజులుగా పెరిగిన బంగారం, వెండి ధరలు తగ్గాయి. బంగారం పది గ్రాముల పై రూ.170లు తగ్గింది. వెండి కిలో పై రూ.100లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,730 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,500 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి 62,000 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News