స్థిరంగా బంగారం.. భారీగా పెరిగిన వెండి

దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉండటంతో కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. వెండి ధర మాత్రం భారీగా పెరిగింది

Update: 2022-09-29 02:20 GMT

బంగారం అంటే మోజు ఎవరికి ఉండదు? డబ్బులుండాలే కాని ఫస్ట్ బంగారాన్ని కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతారు. ముఖ్యంగా మహిళలు తమ వద్ద దాచుకున్న మొత్తాన్ని బంగారం కొనుగోలుకే వినియోగిస్తారు. గృహాపకరణాలు మాదిరిగా బంగారం మారిపోయింది. ఒకప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయాలంటే వెనుకాడేవారు. నేడు దానిని అవసరంగా భావిస్తున్నారు. అందుకే భారత్ లో బంగారానికి అంతగా డిమాండ్ పెరిగింది. ప్రతిరోజూ ధరలు పెరగడమే కాని, తగ్గడం తక్కువగా సార్లు మాత్రమే చూస్తాం. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణం వంటి కారణాల కారణంగా బంగారం ధరలలో మార్పులు జరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.

హైదరాబాద్ మార్కెట్ లో...
తాజాగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉండటంతో కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,970 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,800 రూపాయలు ఉంది. ఇక కిలో వెండి ధర 60,000లకు చేరుకుంది.


Tags:    

Similar News