పసిడి పరుగులు.. వెండి మాత్రం?

దేశంలో ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి

Update: 2022-09-24 02:25 GMT

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. దానికి కారణాలు అనేకం ఉంటాయి. అయితే ధరలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతుండటంతో ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. బంగారానికి ఉన్న డిమాండ్ అటువంటిది మరి. భారతీయ కుటుంబ వ్యవస్థలో భాగమైన బంగారాన్ని వేరు చేసి చూడలేని పరిస్థితి నెలకొంది. శుభకార్యాలు, పండగలు, పబ్బాలకు సయితం బంగారం కొనుగోలు చేయడం అలవాటుగా మారింది. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం కూడా బంగారం మార్కెట్ పెరడగానికి కారణాలుగా చూడవచ్చు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు బంగారం ధరల్లో పెరుగుదల, తగ్గుదలకు కారణమవుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.

కిలో వెండి పై....
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ. 500లు తగ్గగా, కిలో వెండి ధర రూ.1,200లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.46,500లు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,730 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ లో రూ.62,500లుగా ఉంది.


Tags:    

Similar News