షాకింగ్ : పెరిగిన బంగారం ధరలు

ఈరోజు బంగారం ధరలు దేశంలో పెరిగాయి. పదిగ్రాముల బంగారం ధరపై రూ.200లు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి

Update: 2022-12-02 02:38 GMT

పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు పెరుగుతుంటాయి. అయితే పెరిగిన బంగారం ధరలు మళ్లీ అదే స్థాయిలో తగ్గుతాయని అనుకుంటే అది తప్పులో కాలేసినట్లే. ఏదో కొద్దిగా ధరలు తగ్గుతాయి తప్పించి భారీ స్థాయిలో బంగారం ధరలు తగ్గడం ఎప్పుడూ జరగలేదన్నది మార్కెట్ నిపుణుల అంచనా. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయని చెబుతుంటారు. గత కొద్ది రోజులుగా బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు. అలాగని తగ్గలేదు. కొనుగోలుదారులు బంగారం కొనుగోలు చేయడానికి అవసరమైన సమయాలను చూసి, డిమాండ్‌ను బట్టి బంగారం ధరలు పెరుగుతుంటాయి. కొనుగోలుదారులు ఎవరూ ధరల పెరుగుదలను ఎవరూ పట్టించుకోకుండా కొనుగోళ్లు సాగిస్తుండటంతో వ్యాపారులు కూడా ఏమాత్రం భయపడటం లేదు. కొన్ని జ్యుయలరీ షాపుల్లో డిస్కౌంట్ రూపంలో లభిస్తున్నా అది కొనుగోలుదారులను ఆకర్షించడానికే.

వెండి కూడా...
ఈరోజు బంగారం ధరలు దేశంలో పెరిగాయి. పదిగ్రాముల బంగారం ధరపై రూ.200లు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,180 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.48,750లుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర ప్రస్తుతం 69,800 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News