వామ్మో... బంగారం ధర ఇంత పెరిగిందా?

దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ. 820ల వరకూ పెరిగింది. వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగుతుంది

Update: 2022-11-18 03:12 GMT

బంగారం ధర తగ్గిందని సంతోషించారో.. వెంటనే పెరుగుతుంది. ఒకరోజు స్వల్పంగా తగ్గితే మరుసటి రోజు దాని ధర భారీగా పెరుగుతుంది. ఇది బంగారానికి ఉన్న ప్రత్యేకత. తగ్గిందని సంతోషించేలోపే పెరిగి పసిడి ప్రియులను షాక్ కు గురి చేస్తుంది. అందుకే దానిని బంగారం అంటారు. బంగారం అంటే ఇష్టపడని వ్యక్తులు ఉండరు. ఎవరి స్థాయిలో వారు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. గతంలో కొనుగోళ్లకు ఒక సీజన్ అంటూ ఉండేది. కానీ ఇప్పుడు సీజన్ ..గీజన్ జాన్తా నై. ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడుదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.

వెండి స్థిరంగా...
తాజాగా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ. 820ల వరకూ పెరిగింది. వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,180 రూపాయలుగా కొనసాగుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,750 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర 67,200 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News