ధరలు తగ్గాయ్.. కొనుగోళ్లకు గుడ్ టైం

కొద్ది రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తున్నాయి. ఈరోజు కూడా బంగారం ధర తగ్గింది

Update: 2022-11-24 02:35 GMT

gold silver rates in hyderabad

బంగారం అంటేనే అత్యంత ఇష్టపడే వారు అధికంగా ఉండే భారత్ లో డిమాండ్ కూడా అధికంగానే ఉంటుంది. డిమాండ్ కు తగినట్లు సప్లయ్ చేయాలంటే దిగుమతులు ఎక్కువ మొత్తంలో చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే భారత్ బంగారం దిగుమతిలో రెండో స్థానంలో ఉంది. బంగారు ఆభరణాల కోసం ఇప్పటి నుంచే ఆర్డర్ లు ఇచ్చే వారి కోసం కూడా దిగుమతి ఎక్కువగా చేసుకుంటుండటం బంగారు వ్యాపారులకు ఆనవాయితీగా వస్తుంది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం వంటి కారణాలు బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.

ధరలు ఇవే...
గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తున్నాయి. ఈరోజు కూడా బంగారం ధర తగ్గింది. వెండి ధర కూడా స్వల్పంగానే తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,640 రూపాయలుగా కొనసాగుతుంది. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 48,250 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర ప్రస్తుతం 67,500 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News