వామ్మో ... బంగారం ధరలు ఇలానా?

దేశంలో ఈరోజు కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.800లు పెరిగింది

Update: 2022-12-03 03:02 GMT

బంగారం అంటే అంతే మరి. ధరలు పెరుగుతూనే ఉంటాయి. కొనేవాళ్లు ఉంటే పెంచేవాళ్లుంటారన్న సామెతను మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సామాన్యులకు బంగారం ధరలు అందకుండా పోతున్నాయి. రోజురోజుకూ బంగారం ధరలు పెరిపోతున్నాయి. ఎంత పెరిగిందన్నది సమస్య కాదు. ఎంతో కొంత పెంచుతూ వినియోగదారులను షాకింగ్ కు గురి చేస్తున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తుంటాయి. బంగారం పెరిగితే భారీగా, తగ్గితే తక్కువగా ధరలు ఉండటం మామూలే. అయినా బంగారం కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. నేటి నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

భారీగా పెరిగిన వెండి...
గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఈరోజు కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.800లు పెరిగింది. వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,730 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,250 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర కూడా బాగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 71,000 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News