షాకింగ్... పెరిగిన బంగారం ధరలు

దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.400లు,. కిలో వెండి పై రూ.1600 ల వరకూ పెరిగింది

Update: 2022-08-10 02:37 GMT

బంగారం అంటేనే మగువలకు మహ ప్రీతి. చిన్న మొత్తం తమ వద్ద ఉంటే చాలు పసిడి కొనుగోలుకే మహిళలు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారం భాగమైంది. తప్పుపట్టనది కావడం, పెరిగేదే కాని తరిగేది కాకపోవడంతో దీనిని పెట్టుబడిగా కూడా అనేక మంది చూస్తున్నారు. అందుకే బంగారానికి అంత డిమాండ్. ఇక పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు బంగారం దుకాణాలు కళకళ లాడిపోతుంటాయి. ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేయడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయింది. ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు కొనుగోళ్లకు మహిళలు సిద్ధపడుతుంటారు. ఇక జ్యుయలరీ షాపులు ఈఎంఐ వెసులుబాటు కూడా కల్పిస్తుండటంతో బంగారం కొనుగోళ్లు జోరందుకున్నాయనే చెప్పాలి.

ధరలు ఇలా....
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.400లు పెరిగింది. కిలో వెండి పై రూ.1600 ల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,310 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,950 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర 64,500 రూపాయలు. మార్కెట్ లో ఈ రేట్లకు హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది.


Tags:    

Similar News