చెన్నైలో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి

చెన్నైలో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి చెందిన ఘటన సంచలన సృష్టించింది

Update: 2026-01-20 07:27 GMT

చెన్నైలో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి చెందిన ఘటన సంచలన సృష్టించింది. చెన్నై కళ్లకురుచిలో విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో దాదాపు పది మంది వరకూ గాయపడ్డారు. వారిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఉత్సవాల్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి చెందారు.

బెలూన్లలో గ్యాస్ నింపుతుండగా...
బెలూన్లలో గ్యాస్ నిపుతుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పది మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News