తప్పించుకున్న 25 కోట్ల తేనెటీగలు.. వెయిటింగ్ చేస్తున్న నిపుణులు

అమెరికాలోని వాషింగ్టన్‌ రాష్ట్రంలో 25 కోట్ల తేనెటీగలు తప్పించుకున్నాయి.

Update: 2025-06-01 11:51 GMT

Honey bees

అమెరికాలోని వాషింగ్టన్‌ రాష్ట్రంలో 25 కోట్ల తేనెటీగలు తప్పించుకున్నాయి. 31 వేల 751 కిలోల తేనెతుట్టెలతో వెళ్తున్న వాహనం లిండెన్‌ సమీపంలో కెనడా సరిహద్దు ప్రాంతంలో బోల్తా పడింది. తేనెతుట్టెలన్నీ చెల్లాచెదురుగా పడిపోవడంతో తేనెటీగలు బయటికొచ్చేశాయి.


వెంటనే అప్రమత్తమైన అధికారులు తేనెటీగల నిపుణులతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తేనెతుట్టెలను ఒక్కచోటికి చేర్చారు. తప్పించుకున్న తేనెటీగలు తప్పకుండా తుట్టెల వద్దకు తిరిగొస్తాయని ఎదురుచూస్తున్నారు. తేనెటీగలు రాణి ఈగను విడిచి ఉండలేవు. దాన్ని తీసుకొని రెండు మూడు రోజుల్లో వచ్చేయొచ్చని భావిస్తూ ఉన్నారు. అయితే రెండు మూడు రోజుల పాటు ఆ ప్రాంతానికి రావొద్దని స్థానికులకు పోలీసులు సూచించారు.

Tags:    

Similar News