ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు

ఉత్తర భారత దేశంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి కంపించింది

Update: 2023-03-22 02:06 GMT

ఉత్తర భారత దేశంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రికర్ట్ స్టేల్ పై 6.6 గా నమోదయింది. ఆప్ఘనిస్థాన్‌లోని హిందూకుషిలో భూ ఉపరితలం నుంచి 180 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పాకిస్థాన్ వాతావరణ శాఖ తెలిపింి. రాత్రి 10.20 గంటల సమయంలో ఈ భూ కంపం సంభవించింది.ఢిల్లీలోని పలుచోట్ల భవనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

పొరుగు రాష్ట్రాల్లోనూ...
దీంతో ప్రజలు భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు. దేశంలో ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ఈ భూప్రకంపనలు సంభవించాయి. అలాగే పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ లోనూ భూకంపం సంభవించినట్లు చెబుతున్నారు. ఈ దేశాల్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.8 తీవ్రతగా నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News