Breaking : వెనక్కు తగ్గిన డీజీసీఏ .. విమాన ప్రయాణాలకు రిలీఫ్

ఇండిగో విమాన సర్వీసులు రద్దుతో డీజీసీఏ దిగి వచ్చింది

Update: 2025-12-05 08:10 GMT

ఇండిగో విమాన సర్వీసులు రద్దుతో డీజీసీఏ దిగి వచ్చింది. తాము తీసుకు వచ్చిన నిబంధనల్లో మార్పులు తీసుకు వచ్చింది. దేశవ్యాప్తంగా విమానాల ఆలస్యాలు, రద్దు కావడం వంటివి పెరగడంతో ఏర్పడిన ఆపరేషనల్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ఎయిర్‌లైన్స్‌కి తాత్కాలిక ఉపశమనంగా డీజీసీఏ కీలక మార్పు చేసింది. వారాంత విశ్రాంతిని లీవ్‌తో మార్చకూడదని చెప్పిన పూర్వ ఆదేశాన్ని శుక్రవారం నుంచి రద్దు చేసినట్లు సంస్థ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించినట్లు డీజీసీఏ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఎయిర్‌లైన్స్‌ సంస్థల నుంచి...
ఎయిర్‌లైన్స్‌ సంస్థల నుంచి వచ్చిన అనేక ప్రతినిధుల విజ్ఞప్తులపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. పెరుగుతున్న సిబ్బంది కొరత వల్ల క్రూ షెడ్యూళ్లు ఏర్పరిచే విషయంలో ఇబ్బందులు పెరిగాయని కంపెనీలు వివరించాయి. ఈ మార్పుతో క్రూ డ్యూటీ ప్లానింగ్‌లో ఎయిర్‌లైన్స్‌కి కొంత సడలింపు లభించనుంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా విమానాల ఆలస్యాలు, రద్దులు పెరగడంతో ఎయిర్‌లైన్స్‌ సాధారణ సేవలను పునరుద్దరించాలని ప్రయత్నిస్తున్నాయి. కొత్త మార్పు తో విమాన సర్వీసులు యాధాతధంగా నడిచే అవకాశాలున్నాయి. జారీ చేసిన ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని తెలిపింది.


Tags:    

Similar News