ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ భారీ జరిమానా

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ భారీ జరిమానా విధించింది.

Update: 2026-01-18 03:49 GMT

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ భారీ జరిమానా విధించింది. ఇటీవల ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారికి టిక్కెట్ సొమ్ము చెల్లించాలని కూడా ఆదేశించింది.

ప్రయాణికులకు ఇబ్బంది...
తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్ కు డీజీసీఏ .22.2 కోట్ల రూపాయల జరిమానా విధించింది. విమానాల అంతరాయం నేపథ్యంలో జరిమానా విధించినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. జరిమానా చెల్లించడంతో పాటుగా యాభై కోట్ల రూపాయలను బ్యాంక్‌ గ్యారంటీ సమర్పించాలని డీజీసీఏ ఆదేశించింది. దీనిపై ఇండిగో ఎయిర్ లైన్స్ ఎలా స్పందిస్తున్నది చూడాలి.


Tags:    

Similar News