Delhi : ఎర్రకోట మెట్రో స్టేషన్ మూసివేత
భద్రతా కారణాల దృష్ట్యాఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ మూసివేశారు.
భద్రతా కారణాల దృష్ట్యాఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ మూసివేశారు. గత సోమవారం ఎర్రకోట గేట్ నెంబరు 1 సమీపంలోనే పెద్దయెత్తున పేలుడు జరిగి పదమూడు మంది మరణించిన నేపథ్యంలో పోలీసులు మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాలన్నింటినీ తమ అధీనంలోకి తీసుకున్నారు. కేసు విచారణకు అవసరమైన వాటికోసం దర్యాప్తు చేస్తున్నారు.
తదుపరినోటీసు వచ్చేంత వరకూ...
దీంతో కొద్దిరోజుల పాటు ఎర్రకోట మెట్రో స్టేషన్ ను మూసివేయాలని నిర్ణయించారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఎర్రకోట మెట్రో స్టేషన్ మూసివేసి ఉంటుందని అధకిారుల చెప్పారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ మినహా అన్ని స్టేషన్లు యథావిధిగా పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు. మరొకవైపు ఢిల్లీలో హై అలెర్ట్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.