Kerala : కేరళలో మరో అరుదైన వ్యాధి.. ఇప్పటికి ఐదుగురు మృతి
కేరళలో అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది
కేరళలో అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. కేరళలో సోమవారం మరో వ్యక్తి అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే అరుదైన, ప్రాణాంతకమైన మెదడు ఇన్ఫెక్షన్‌తో మృతి చెందాడు. దీంతో ఆగస్టు నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. దీంతో కేరళ అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.
మలప్పురం జిల్లాకు చెందిన...
మృతురాలు కేరళలోని మలప్పురం జిల్లా వండూర్‌కు చెందిన యాభై నాలుగేళ్ల మహిళ. ఆమె పొరుగు జిల్లాలోని కోజికోడ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని కేరళ వైద్య ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇదే సమయంలోశనివారం రోజున వయనాడ్ జిల్లా సుల్తాన్ బతేరి ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి కూడా ఇదే ఇన్ఫెక్షన్ కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే.