Delhi Bomb Blast Case : పదిహేనుకు చేరిన మృతుల సంఖ్య
ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో మృతుల సంఖ్య 15కు చేరింది
ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో మృతుల సంఖ్య 15కు చేరింది. గాయాలతో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులు వరుసగా సోమ, ఆదివారాల్లో చనిపోవడంతో మొత్తం సంఖ్య 15కు పెరిగిందని అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకూ ఎర్రకోట ఎదుట జరిగిన బాంబు పేలుళ్ల కేసులో మృతుల సంఖ్య పదిహేనుకు చేరుకుది. ఒకరు ఆదివారం ప్రాణాలు కోల్పోగా, మరో బాధితుడు వినయ్ పాఠక్ సోమవారం మరణించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు.
ఉమర్ ఉన్ నబీతో సంబంధాలున్న...
ఈనెల 10వ తేదీన ఎర్రకోట వద్ద పేలిన పేలుడు పదార్థాలతో నిండిన కారును నడిపింది డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని భద్రతా సంస్థలు గుర్తించాయి. అతడితో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న టెర్రర్ మాడ్యూల్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మాడ్యూల్‌కు సంబంధించిన అంతర్గత వ్యవస్థ స్పష్టంగా ఉన్నట్లు, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానళ్లను, ఆయుధాల తరలింపులో సమన్వయం ఉన్నట్లు ఆధారాలు లభించాయని అధికార వర్గాలు వెల్లడించాయి.