తండ్రి నిర్ణయంపై హైకోర్టులో గెలిచిన కుమార్తె

తన తండ్రి ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా బాధితుడి తరఫున వాదించి గెలిచింది ఓ కూతురు.

Update: 2025-08-11 10:15 GMT

తన తండ్రి ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా బాధితుడి తరఫున వాదించి గెలిచింది ఓ కూతురు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టుఈ ఘట్టానికి వేదికగా మారింది. 2023 జనవరి 13న పీలీభీత్‌కు చెందిన ఓ బాలిక రైలులో వెళుతుండగా లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో పోలీసు కానిస్టేబులు తౌఫిక్‌ అహ్మద్‌పై పోక్సో కేసు నమోదైంది. అప్పటి బరేలి రేంజ్‌ ఐజీ రాకేశ్‌సింగ్‌ అతణ్ని సర్వీసు నుంచి తొలగించి, జైలుకు కూడా పంపారు. ఈ నిర్ణయాన్ని అహ్మద్‌ హైకోర్టులో సవాలు చేయగా అతడి తరఫున రాకేశ్‌సింగ్‌ కుమార్తె అనురా సింగ్‌ వాదించారు. విచారణ అధికారి నేరారోపణలను నిరూపించడంతోపాటు ఆయనే శిక్షను కూడా ఖరారు చేశారని, అది క్రమశిక్షణ యంత్రాంగం పనిగా కోర్టుకు తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన జస్టిస్‌ అజిత్‌కుమార్‌ పాత ఉత్తర్వులను కొట్టివేశారు. అహ్మద్‌ను తిరిగి విధుల్లోకి తీసుకొని, మూడు నెలల్లోపు కొత్త విచారణను పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. తన కుమార్తె వృత్తిపరమైన నిబద్ధతను చూసి గర్వపడుతున్నట్లు రాకేశ్‌సింగ్‌ ఆనందం వ్యక్తం చేశారు. తన తరఫున వాదించిన న్యాయవాది ఐజీ కుమార్తె అని చివరిదాకా తెలియదని అహ్మద్‌ చెప్పడం మరో ట్విస్ట్.

Tags:    

Similar News