భారత్ లో తగ్గిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఒక్కరోజులోనే 10,649 కరోనా కేసులు నమోదయ్యాయి. 36 మంది కరోనా కారణంగా మరణించారు.

Update: 2022-08-24 04:38 GMT

భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఒక్కరోజులోనే 10,649 కరోనా కేసులు నమోదయ్యాయి. 36 మంది కరోనా కారణంగా మరణించారు. నిన్న ఒక్కరోజులోనే 10,677 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.19 శాతానికి తగ్గింది. యాక్టివ్ కేసుల శాతం 0.22 శాతంగా నమోదయింది. రికవరీ రేటు 98.59 శాతంగా నమోదయింది.

వ్యాక్సినేషన్ ప్రక్రియను...
ఇక దేశంలో ఇప్పటి వరకూ 4,43,68,195 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 4,37,44,301 మంది చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ దేశంలో 5,27,452 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం దేశంలో 96,442 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 2,10,58,83,682 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశామని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News