నేడు కరోనా కేసులు ఎన్నంటే?
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1580 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1580 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కేసులు తగ్గుముఖం పట్టినా కోవిడ్ నిబంధనలు పాటించడం మేలని, లేకుంటే మరోసారి విజృంభించడం ఖాయమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
యాక్టివ్ కేసులు...
భారత్ లో ప్రస్తుతం 18,009 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్రాలకు ప్రత్యేకంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలు కఠినంగానే అమలు పర్చాలని కోరింది. మాస్క్‌లను ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడకం వంటివి చేయాలని సూచించింది.