భారత్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 9,195 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 304 మంది మరణించారు.
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 9,195 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 304 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,42,43,945 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 77,002 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా కేసులు నిన్నటి కంటే 44 శాతం ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది.
యాక్టివ్ కేసులు...
భారత్ లో ఇప్పటి వరకూ 3,52,36,049 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,80,982 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,43,73,76,774 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. తాజాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 781కు చేరుకుంది. అత్యధికంగా ఢిల్లీలో 238 కేసులు నమోదయ్యాయి.