Rahul Gandhi : మోదీ సర్కార్ పై విరుచుకుపడిన రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేశారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో అట్టడుగున ఉన్న వారికి ప్రయోజనాలు అందాలని ఆయన ఆకాంక్షించారు. ఏఐసీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, ఆదివాసీలు, దళితులు, గిరిజనులు లబ్ది పొందాలంటే దేశ వ్యాప్తంగా కులగణన జరగాలని ఆయన కోరారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ కులగుణన చేసి కేంద్రానికి పంపిందని, దానిని ఇంత వరకూ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని రాహుల్ గాంధీ విమర్శించారు.
రేవంత్ పంపిన బిల్లును...
బీసీ కులగణన బిల్లును ఆమోదించాలని మోదీ ప్రభుత్వాన్ని కోరారు. దళితులు, ఆదివాసీల ప్రయోజనాలను కాపాడాలన్న ఉద్దేశ్యంలో ప్రభుత్వం లేదని అర్థమవుతుందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. వారి సమస్యలను పరిష్కరించాలని తాము ఎన్నాళ్ల నుంచో కోరుతున్నా పట్టించుకోకుండా ఇతర విషయాలను ఫోకస్ పెడుతుందని అన్నారు. కులగణన విషయంలో దేశంలోనే తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిందని రాహుల్ అభిప్రాయపడ్డారు. తెలంగాణాలో 90 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని, వారి ప్రయోజనాలను కాపాడాలని ఆయన కోరారు.