మరోసారి ఉద్రిక్తతలు.. భారత్ లో మరో వంతెన ఏర్పాటు చేసుకున్న చైనా

భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు మొదలయ్యాయి. భారత్‌లో దురాక్రమించిన ప్రాంతంలోనే చైనా వారధిని నిర్మించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ స్పష్టం చేశారు.

Update: 2022-05-21 05:13 GMT

భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు మొదలయ్యాయి. భారత్‌లో దురాక్రమించిన ప్రాంతంలోనే చైనా వారధిని నిర్మించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ చైనా నిర్మించిన తొలి వారధి అసలు వారధి కాదని, ఇప్పుడు వెలుగులోకి వచ్చిన పెద్ద వారధి నిర్మాణం కోసం కట్టినదని రక్షణ శాఖ వర్గాలు వివరించాయి. ప్యాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న రెండో వంతెన 1960 నుంచి ఆ దేశం అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతంలో ఉందని భారత్ శుక్రవారం స్పష్టం చేసింది. చైనా దాని మునుపటి వంతెనతో పాటు పాంగోంగ్ సరస్సుపై వంతెనను నిర్మిస్తున్నట్లు మేము నివేదికలను చూశామని.. ఈ రెండు వంతెనలు 1960 నుంచి చైనా ఆక్రమణలో కొనసాగుతున్న ప్రాంతాలలో ఉన్నాయని బాగ్చి వెల్లడించారు. జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని మేము అనేక సందర్భాల్లో స్పష్టం చేసామన్నారు ఇతర దేశాలు భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తాయని మేము ఆశిస్తున్నామని అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు. దేశం భద్రతా ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షించేలా చూసేందుకు ప్రభుత్వం ముఖ్యంగా 2014 నుంచి సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసిందని, ఇందులో రోడ్లు, వంతెనల నిర్మాణం కూడా ఉన్నాయని బాగ్చి తెలిపారు.


పాంగోంగ్ త్సో సరస్సుపై చైనా వంతెన నిర్మించిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. దేశ జాతీయ భద్రతను, ప్రాదేశిక సమగ్రతను ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హితవు పలికారు. చైనా దూకుడు పట్ల పిరికితనం, అతి మంచితనంతో కూడిన స్పందనలు పనిచేయవని, దేశ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రధానిదేనని స్పష్టం చేశారు. చైనా తొలి వంతెన కట్టినప్పుడు చెప్పిన జవాబునే కేంద్రం ఇప్పుడు కూడా చెబుతోందని, సరిహద్దుల్లో పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని అంటోందని విమర్శించారు. చైనా ఓవైపు సరిహద్దుల్లో భారీ కట్టడాలు చేపడుతుంటే కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటోందని నిలదీశారు.
Tags:    

Similar News