Operation Sindoor: ఆపరేషన్ సింధూరపై చైనా అలా.. అమెరికా ఇలా

పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాల ధ్వంసం చేసిన ఆపరేషన్ సింధూరపై చైనా, అమెరికా దేశాలు స్పందించాయి

Update: 2025-05-07 05:57 GMT

పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాల ధ్వంసం చేసిన ఆపరేషన్ సింధూరపై చైనా, అమెరికా దేశాలు స్పందించాయి. భారత్, పాక్ రెండూ దాయాది దేశాలని, ఈ రెండు దేశాలు చైనాకు పొరుగు దేశాలని చైనా తెలిపింది. చైనా అన్ని రకాలుగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుందన్నచైనా శాంతి, స్థిరత్వంతో భవిష్యత్ ప్రయోజనాల కోసం వ్యవహరించాలని రెండు దేశాలను కోరుతున్నామని తెలిపింది. ప్రశాంతం ఉంటూ సంయమనం పాటించాలని, పరిస్థితిని మరింత క్లిష్టతరం చేయకుండా రెండు దేశాలు దూరంగా ఉండాలని చైనా ఆకాంక్షించింది.

త్వరగా ముగింపు చెప్పాలని...
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన దాడులను ఉద్దేశించి ఆయన స్పందించారు. వీలయినంత వరకూ దీనికి త్వరగా ముగింపు చెప్పాలని ట్రంప్ కోరారు. రెండు శక్తివంతమైన దేశాల మధ్య యుద్దం ఎవరూ కోరుకోరని ట్రంప్ అన్నారు. భారత్, పాకిస్తాన్ లకు ఎంతో చరిత్ర ఉందని, వీటి మధ్య ఎన్నాళ్లుగానో ఉద్రిక్తతలు ఉన్నాయని, కానీ ప్రపంచానికి శాంతి అవసరమని, ఘర్షణలు వద్దంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.


Tags:    

Similar News