Chandrababu : దేశంలో అత్యంత సంపన్న సీఎం చంద్రబాబు

దేశంలోనే అత్యంత సంపన్నముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ నివేదిక తెలిపింది

Update: 2025-08-23 03:38 GMT

దేశంలోనే అత్యంత సంపన్నముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తుల విలువ 931 కోట్ల రూపాయల విలువగా చెబుతున్నారు. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ నివేదిక తెలిపింది. రెండో స్థానంలో అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ ఉన్నారని నివేదిక తెలిపింది. పెమా ఖండూ ఆస్తుల విలువ 332 కోట్ల రూపాయలు అని నివేదిక స్పష్టం చేసింది.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ నివేదికలో...
తక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ నివేదిక తెలిపింది. మమత బెనర్జీ ఆస్తుల విలువ కేవలం పదిహేను లక్షల రూపాయలు మాత్రమేనని చెప్పింది. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ నివేదిక దేశంలోని 31మంది సీఎంల ఆస్తుల విలువ రూ.1,630 కోట్లుగా ఉందని తెలిపింది.


Tags:    

Similar News