కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు

Update: 2026-02-10 12:12 GMT

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టుల పూర్తి, కొత్త రైలు మార్గాలు, సర్వీసులు నడపాలని వినతి పత్రం ఇచ్చారు. ఇటీవల బడ్జెట్టులో ప్రకటించిన హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్ల గురించి భేటీలో ప్రస్తావించారు. ఏపీని టచ్ చేస్తూ వెళ్లే మూడు హై స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించడంపై కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. బెంగళూరు-చెన్నై హై స్పీడ్ రైల్ కారిడారును తిరుపతిని కనెక్ట్ చేసేలా చూడాలని కేంద్ర మంత్రిని చందబాబు కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. తాడిపత్రి నుంచి ముంబై జేఎన్ పీటీ పోర్టుకు అరటి ఎగుమతులకు వీలుగా 50 శాతం రాయితీపై ఖాళీ రీఫర్ కంటైనర్లు ముఖ్యమంత్రి కేటాయించాలన్నారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, అమరావతిలలో గ్రీన్ ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు కేంద్ర మంత్రికి తెలిపారు.

పలు రైలు మార్గాలను...
ఉత్తర- దక్షిణ భారత్ కలిపేలా ఇటార్సీ- విజయవాడ మధ్య ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ఏర్పాటుకు సహకారం అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలోని పోర్టులను అనుసంధానిస్తూ విజయవాడ మీదుగా ఖరగ్ పూర్- చెన్నై మధ్య ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయాలని కోరారు. రాయలసీమ సహా గిరిజన ప్రాంతాలను కనెక్టు చేసేలా వివిధ కొత్త రైల్వేమార్గాల ప్రతిపాదనల్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ-విజయవాడల మధ్య హైస్పీడ్, విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్, తిరుపతి-చిత్తూరు మధ్య హైస్పీడ్ లింక్ కారిడార్ మంజూరు చేయాలని కోరినచంద్రబాబు హైదరాబాద్- శ్రీశైలం- మార్కాపురం కొత్త రైల్వే లైన్ ద్వారా శ్రీశైల పుణ్యక్షేత్రానికి కనెక్టివిటీని పెంచాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి మీదుగా విజయవాడ-బెంగుళూరు మధ్య వందేభారత్ సర్వీసును నడపాలని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ ఎక్స్ ప్రెస్ రైళ్లకు కుప్పంలో స్టాపింగ్ ఇవ్వటంతో పాటు రైలు బోగీ నిర్వహణ టెర్మినల్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారరు.













Tags:    

Similar News