లోక్ సభలో వివాహ వయస్సు సవరణ బిల్లును ప్రవేశపెట్టిన స్మృతి ఇరానీ

ప్రతిపక్షాలు మాత్రం 18 ఏళ్లకే ఓటు వేసే హక్కు ఉన్నప్పుడు 18 ఏళ్ల వయసులో భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ, స్వాతంత్య్రం మహిళలకు లేదా అని ప్రశ్నిస్తున్నాయి. ఇటీవలే సమాజ్ వాదీ పార్టీ నేతలు కూడా కేంద్రం

Update: 2021-12-21 10:57 GMT

సభలో అంతా గందరగోళం. అంత గందరగోళంలోనూ మంగళవారం వివాహ వయస్సు సవరణ బిల్లును మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఒక పక్క ప్రతిపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లును ఆమోదిస్తే.. మహిళల హక్కులను హరించడమేనని ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా.. ప్రతిపక్షాల ఆరోపణలను పట్టించుకోని కేంద్రం తాము అనుకున్నట్లే బిల్లును పాస్ చేసేందుకు రెడీ అయింది. ఇంతలో ప్రతిపక్షాలన్నీ సభలో మాటల యుద్ధానికి దిగడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు

కాగా.. యువతుల వివాహ వయస్సు సవరణ బిల్లు ఏ అడ్డంకి లేకుండా లోక్ సభలో ఆమోదం పొందుతున్న ధీమాతో ఉంది కేంద్రప్రభుత్వం. ఎందుకంటే.. అధికార పార్టీ సంఖ్యా బలం ఎక్కువ కాబట్టి.. అలాగే రాజ్య సభలోనూ అధికారపార్టీకి మెజార్టీ ఉంది. ఇతర పార్టీలు కూడా ఈ బిల్లుకు సహకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కానీ ప్రతిపక్షాలు మాత్రం 18 ఏళ్లకే ఓటు వేసే హక్కు ఉన్నప్పుడు 18 ఏళ్ల వయసులో భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ, స్వాతంత్య్రం మహిళలకు లేదా అని ప్రశ్నిస్తున్నాయి. ఇటీవలే సమాజ్ వాదీ పార్టీ నేతలు కూడా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాత్రం తాను కేంద్రానికి వ్యతిరేకం కాదని స్పష్టత ఇచ్చారు.
ఇటీవలే కేంద్రం మహిళల వివాహ వయస్సును 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేబినెట్ కూడా తమ ఆమోదాన్నిచ్చింది. 21 సంవత్సరాల తర్వాత ఆడపిల్లలకు వివాహమైతే.. వారు పరిపక్వతతో ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారని, ఏ విషయంలోనైనా సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు తెలిపింది.


Tags:    

Similar News