Toll Fees : టోల్ ఫీజు పై కొత్త విధానం.. ఇక దేశంలో ఎక్కడైనా? ఎప్పుడైనా? గుడ్ న్యూస్
జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి త్వరలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది
జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి త్వరలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇకపై తరచూ ఫాస్ట్ ట్యాగ్ లో డబ్బులు జమ చేయకుండా కొత్త విధానాన్ని అమలులోకి తేవాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలన ఉంది. అది అమలయితే మాత్రం నిత్యం జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మాత్రం తీపికుబురు అవుతుందని చెప్పకతప్పదు. సంవత్సరం మొత్తం మీద ఒకసారి చెల్లిస్తే చాలు దేశంలో ఏ జాతీయ రహదారిపైనా టోల్ ఫీజు చెల్లించకుండా ప్రయాణించవచ్చు.
ఒకేసారి మూడు వేలు..
రహదారులపై టోల్ వసూలును మరింత సులభతరం చేయడంలో భాగంగా కేంద్రప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు యోచిస్తుంది. టోల్ చార్జీలలో సగటున 50 శాతం వరకు రాయితీ కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు అందుతున్నసమాచారాన్నిబట్టి తెలుస్తోంది. అందులో భాగంగా మూడు వేల రూపాయలు చెల్లించి ఏడాది పాటు టోల్ రుసుం చెల్లించకుండా ప్రయాణించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించిన కార్లు ఏడాది పాటు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలతో పాటు రాష్ట్ర రహదారులపై కూడా ప్రయాణించే వీలవుతుంది.