రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశం
ఆపరేషన్ సిందూర్ గురించి కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది
ఆపరేషన్ సిందూర్ గురించి కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. అఖిల పక్ష సమావేశంలో ఆపరేషన్ సిందూర్ లో ఏం జరిగిందన్న దానిపై అన్ని పక్షాలకు కేంద్ర ప్రభుత్వం వివరించనుంది. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే అందుకు భారత ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పనుంది. అదే సమయంలో ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆపరేషన్ సిందూర్ గురించి వివరించనున్నారు.
ప్రధాని విదేశీ పర్యటనల రద్దు...
మరోవైపు ఈ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీపర్యటనలను రద్దు చేసుకున్నారు. ఈనెలలో యూరప్, క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల్లో మోదీ పర్యటించాల్సి ఉంది. అయితే ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో తన విదేశాల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. రష్యా నిర్వహించనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో సయితం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనరు.