టిక్‌టాక్‌పై నిషేధం ఉంది.. ప్రచారాలను నమ్మొద్దు
టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి
టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. టిక్ టాక్ తిరిగి భారత్ లోకి వస్తుందన్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ సేవలు భారత్‌లో మళ్లీ అందుబాటులోకి వచ్చాయని శుక్రవారం నుంచి ప్రచారం సాగుతోంది.
అదే కారణం...
చైనాతో భారత్ వాణిజ్య సంబంధాలు మెరుగు పడటంతో టిక్ టాక్ కూడా మళ్లీ వస్తుందని ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుండటంతో దీనిపై ప్రభుత్వ వర్గాలు తాజాగా స్పందించాయి. టిక్‌టాక్‌ను అన్‌బ్లాకింగ్ చేసినట్లు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని పేర్కొన్నాయి. అవి తప్పుడు వార్తలు అని వెల్లడించాయి. వాటిని నమ్మవద్దని తెలిపాయి.