నిరుద్యోగులకు నెలకు ఐదు వేలు.. వెంటనే దరఖాస్తు చేయండిలా

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-03-05 13:09 GMT

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి ఇంటర్నిష్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఈ నెల 12వ తేదీన తుదిగడువుగా నిర్ణయించారు. ఈ పథకం కింద ఎంపికయిన వారికి నెలకు ఐదు వేల రూపాయలు ఇంటర్నిష్ కింద స్టయిఫండ్ ఇస్తారు. ఇందుకు పదోతరగతి, ఇంటర్, ఏదైనా డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ చదివిన వారు అర్హులని నిర్ణయించారు.

అర్హతలివే...
వయసు 21 నుంచి 24 ఏళ్ల వయసులోపు ఉండి నిరుద్యోగులై ఉండాల్సి ఉంది. కుటుంబ ఆదాయం ఏడాదికి ఎనిమిది లక్షల రూపాయలు లోపు మాత్రమే ఉండాలన్న నిబంధన ఉంది. ఈ పథకం ద్వారా దేశంలోని టాప్ ఐదు వందల కంపెనీల్లో ఏడాది పాటు ఐదు వేల రూపాయలు స్టయిఫండ్ ఇస్తారు. అలాగే వన్ టైం గ్రాంట్ కింద ఆరు వేల రూపాయలు ఇస్తారు. సో.. నిరుద్యోగులూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలని కోరుతున్నారు.


Tags:    

Similar News