Breaking : యూపీఐ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. యూపీఐ సేవలను వినియోగించే వారికి తీపికబురుఅందించింది

Update: 2025-06-11 14:21 GMT

UPI Update

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. యూపీఐ సేవలను వినియోగించే వారికి తీపికబురుఅందించింది. యూపీఐ సేవలను వినియోగిస్తే ఎలాంటి ఛార్జీలు పడవని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. యూపీఐ లావాదేవీలు మూడు వేల రూపాయలు దాటితే చార్జీలు వసూలు చేస్తారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని, అటువంటి ప్రచారాలను నమ్మవద్దని పేర్కొంది.

ఎటువంటి ఛార్జీలుండవని...
యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలుచేయబోవడం లేదని కేంద్ర ప్రభుత్వంస్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాలను ప్రజలను నమ్మవద్దని, అలా తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. డిజిటల్ పేమెంట్స్ లో యూపీఐ ప్రధానంగా ఉండటంతో ఎటువంటి ఛార్జీలుఉండబోవని ఆర్థిక శాఖ ప్రకటించడ నిజంగా యూపీఐ సేవలు వినియోగించే వారికి ఊరట అని చెప్పాలి.


Tags:    

Similar News