కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఉచితంగా ఆధార్ అప్ డేట్
దేశంలో ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డులను అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది
దేశంలో ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డులను అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. గడువును మరింతగా పొడిగించింది. అయితే జూన్ 14వ తేదీ లోపు ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకునే వారికి బంపర్ ఆఫర్ ను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. జూన్ 14వ తేదీలోపు అప్ డేట్ చేసుకుంటే ఉచితంగా చేసుకోవచ్చని తెలిపింది.
జూన్ 14వరకు...
ఆధార్ సెంటర్లలో జూన్ 14వరకు ఉచిత ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది.ఆధార్ కార్డులో పేరులో మార్పులు,చిరునామా,ఫోన్ నంబర్ వంటి వివరాలను ఈ గడువులోపు సవరించుకోవచ్చు.అలాగే అప్ డేట్ కూడా చేసుకోవచ్చు. దరఖాస్తు దారులు https://uidai.gov.in వెబ్ సైట్ ద్వారా లేదా ఆధార్ సెంటర్లను సందర్శించి అప్ డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.