రాహుల్ కు వారం రోజుల డెడ్ లైన్ : సీఈసీ

ఎన్నికల సంఘానికి ఎలాంటి తేడాలుండవని, ఒకరిపై ప్రేమ,మరొకరిపై ద్వేషం ఉండదని కేంద్ర ఎన్నికల కమినర్ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు

Update: 2025-08-17 11:48 GMT

ఎన్నికల సంఘానికి ఎలాంటి తేడాలుండవని, ఒకరిపై ప్రేమ,మరొకరిపై ద్వేషం ఉండదని కేంద్ర ఎన్నికల కమినర్ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. కొద్దిసేపటిక్రితం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటు చోరీపేరుతో కొందరు అనుమానాలను దేశ ప్రజల్లో రేపుతున్నారని కేంద్ర ఎన్నికల కమినర్ జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. బీహార్ లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమన్నారు. పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుందని ఆయన అన్నారు.

ఆరోపణలు చేయడం అవమానించడమే...
ఇటువంటి ఆరోపణలు రాజ్యాంగ సంస్థలను అవమానించడమేనన కేంద్ర ఎన్నికల కమినర్ జ్ఞానేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితాను బూత్ లెవెల్లో ప్రతి రాజకీయ పార్టీ చూసుకుంటుందని ఆయనఅ అన్నారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ఓటర్ల జాబితాను సవరిస్తున్నట్లు ఆయన తెలిపరు. అలాగే ఓటు చోరీపై చేస్తున్న ఆరోపణలతో ఆధారాలతో సహా వారం రోజులలోపు అఫడవిట్ వేయాలన్న కేంద్ర ఎన్నికల కమినర్ జ్ఞానేశ్ కుమార్ లేకుంటే దేశానికి క్షమాపణ చెప్పాలని కోరారు. అఫడవిట్ ఇవ్వకపోతే నిరాధార ఆరోపణగానే భావిస్తామని చెప్పారు.


Tags:    

Similar News