BJP : నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది.

Update: 2025-10-11 03:15 GMT

భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీట్ల విషయంలో కూడా నేడు చర్చించే సమావేశంలో అవకాశముంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై...

దీంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పార్టీ అభ్యర్థిని కూడా నిర్ణయించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర కమిటీ నుంచి కొన్ని పేర్లు కేంద్ర ఎన్నికల కమిటీకి చేరాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో నేడో, రేపో బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ పెద్దలతో సమావేశమై జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు రాజకీయ అంశాలపై చర్చించనున్నారరు.


Similar News